ఇటీవల కాలంలో హీరోయిన్ల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. యంగ్ హీరోతో ఆమె పెళ్లి అంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా మీనాక్షి చౌదరి స్పందించి క్లారిటీ ఇచ్చింది.
టాలీవుడ్‌లో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ఖాతాలో లక్కీ భాస్కర్, గుంటూరు కారం వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి రూమర్లపై ఆమె మాట్లాడింది.
“నాపై ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నేను ఇప్పటివరకు పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయినా ఇలాంటి వార్తలు నా కెరీర్‌కు ఇబ్బందికరంగా మారాయి. నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అని మీనాక్షి చౌదరి స్పష్టం చేసింది.


