వెర్సటైల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-కాన్సెప్ట్ థ్రిల్లర్ మూవీ ‘సరస్వతి’ షూటింగ్ పూర్తి చేసుకుంది. దోస డైరీస్ బ్యానర్‌పై వరలక్ష్మి, ఆమె సోదరి పూజా శరత్ కుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్, పక్కా ప్లానింగ్, క్లియర్ విజన్‌తో అనుకున్న షెడ్యూల్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేశారు. ఫైనల్ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ, షూటింగ్ విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్‌కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం థమన్ ఎస్, సినిమాటోగ్రఫీ ఎ.ఎం. ఎడ్విన్ సకే, ఎడిటింగ్ వెంకట్, ఆర్ట్ డైరెక్షన్ సుధీర్ అందిస్తున్నారు.


