హెచ్.ఎన్.జి సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన–దర్శకత్వంలో రూపొందిన ‘సఃకుటుంబానాం’ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పొందుతోంది. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం, మధు దాసరి సినిమాటోగ్రఫీ, శశాంక్ మలి ఎడిటింగ్ ఈ చిత్రానికి విశేష ఆకర్షణలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
మొదట ఈ నెల 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం, అదే రోజున నందమూరి బాలకృష్ణ గారు నటించిన ‘అఖండ తాండవం’ చిత్రం విడుదలవుతుండడంతో, బాలయ్య గారి పట్ల గౌరవ సూచకంగా తమ చిత్ర విడుదలను డిసెంబర్ 19కి వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు మహదేవ్ గౌడ్, నాగరత్న తెలిపారు.
“మా సినిమా వల్ల బాలయ్యగారి చిత్రానికి ఎటువంటి అంతరాయం కలగకూడదనే భావంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కొన్ని నిర్ణయాలు వ్యాపారం కోసం కాదు, భావోద్వేగాల కోసం. ‘జై బాలయ్య’ నినాదం కోసం కూడా ఇదే గౌరవం” అని తెలిపారు.


