సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హర్ష వర్దన్ షిండే నిర్మాణంలో బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’ పై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో దివిని ఓ శక్తివంతమైన యోధురాలిగా చూపించిన తీరు ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేసింది. అగ్ని జ్వాలల మధ్య కదనరంగంలో దూసుకుపోతున్న దివి లుక్, బ్యాక్డ్రాప్లో కనిపించిన యుద్ధ దృశ్యాలు పోస్టర్ను మరింత ఇంటెన్స్గా నిలబెట్టాయి. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ విడుదల కానున్నాయి.
- December 10, 2025
0
52
Less than a minute
You can share this post!
editor


