Movie Muzz

ఈషా ట్రైలర్‌ – నిశ్శబ్దంలో దాక్కున్న భయం!”

ఈషా ట్రైలర్‌ – నిశ్శబ్దంలో దాక్కున్న భయం!”

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.  వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న  థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక.  సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత  కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇప్పటి వరకు వచ్చిన రెగ్యులర్‌ హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. రెగ్యులర్‌ హారర్‌ ఫార్ములాకు భిన్నంగా ఉండేలా కనిపిస్తుంది. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అని ట్రైలర్‌ మొదలు ఆసక్తికరంగా మొదలవుతుంది.

editor

Related Articles