జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో… క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ ‘గోట్’ ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ… మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. తమిల్ లో నాకు బ్యాచిలర్ ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో తెలుగులో ‘గోట్’ సినిమా అంతా పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. కథ విన్నప్పుడు ఫుల్ కామెడీ నవ్వుతూనే ఉన్నాను తెలుగులో సినిమా చేస్తే ఇలానే ఉండాలనిపించింది. బ్యాచిలర్ సినిమాకి తెలుగు ఆఆడియన్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అది మంచిగా ఉండాలని నా ప్రయత్నం. అందుకే ఈ సినిమా చేశాను. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సుధీర్ గారు మల్టీ టాలెంటెడ్ ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
- December 3, 2025
0
71
Less than a minute
You can share this post!
editor


