సమంత రెండో పెళ్లి? బయటకొచ్చిన అసలైన నిజం.

సమంత రెండో పెళ్లి? బయటకొచ్చిన అసలైన నిజం.

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరియు దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య వివాహం జరిగినట్టుగా కొన్ని వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా రూమర్లు ప్రచారం చేస్తున్నారు. రూమర్స్ ప్రకారం, ఈ వివాహం డిసెంబర్ 1, 2025 ఉదయం తమిళనాడులోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో జరిగింది అని కొన్ని వర్గాలు తెలిపారు. వేడుకకు కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది మిత్రులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. సమంత ఈ సందర్భంలో ఎరుపు రంగు చీరలో కనిపించి, వేడుక సింపుల్‌గా జరిగినట్లు సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి. అయితే, సమంత గారు లేదా రాజ్ గారు ఇప్పటివరకు వివాహం జరిగినట్లు అధికారికంగా ధృవీకరించలేదు. రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామళి డే క్రిప్టిక్ స్టోరీ ద్వారా ఈ రూమర్‌ను మరింత హాట్ టాపిక్‌గా మార్చింది. ఫ్యాన్స్ మరియు మీడియా ఈ వార్తను ప్రస్తుతం గాసిప్ స్థాయిలో మాత్రమే చూస్తున్నాయి. పూర్తి ధృవీకరణ వచ్చే వరకు ఇది రూమర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

editor

Related Articles