డిసెంబర్ 12… ‘సఃకుటుంబానాం’లో ట్విస్ట్ ఏంటి?

డిసెంబర్ 12… ‘సఃకుటుంబానాం’లో ట్విస్ట్ ఏంటి?

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించగా మధు దాసరి డీఓపీగా, శశాంక్ మలి ఎడిటర్‌గా పనిచేశారు. విడుదల తేదీ దగ్గరపడుతుండగా ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బుచ్చిబాబు సనా మాట్లాడుతూ, “బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ‘నాన్నకు ప్రేమతో’, ‘ఆర్య 2’ చిత్రాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఇప్పుడు వారి పక్కన నిలబడి దర్శకుడిగా మాట్లాడడం నాకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను” అని తెలిపారు.

editor

Related Articles