జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం నటుడిగా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, అసలు ఆసక్తి ఏదంటే—డైరెక్షన్‌నా? యాక్టింగ్‌నా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, “నాకు మొదట నుంచే నటన అంటే చాలా ఇష్టం. ‘చాయ్ బిస్కెట్’లో ఉన్నప్పుడు కథలు కూడా రాసేవాడ్ని. అప్పుడే ‘అతిథి’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ తరువాత దర్శకుడిగా అవకాశాలు వచ్చాయి. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అలా కథలు రాయడం, డైరెక్షన్ వైపు దృష్టి పెట్టాను. కానీ నాలోని యాక్టింగ్ కోరిక మాత్రం అప్పుడు తీర్చుకోలేకపోయాను. ఇప్పుడు ఆ కోరికను నెమ్మదిగా నెరవేర్చుకుంటున్నాను” అని చెప్పారు.
- December 1, 2025
0
32
Less than a minute
You can share this post!
editor

