2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాలలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతం ‘భీమవరం బల్మా’ తాజాగా విడుదలైంది. ‘భీమవరం బల్మా’ గీతావిష్కరణ వేడుక భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. యువత కోలాహలం నడుమ ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందం సందడి చేసింది.ముఖ్యంగా సంక్రాంతి పండుగను కాస్త ముందుగానే తీసుకొచ్చినట్టుగా ఎద్దుల బండిపై నవీన్ పోలిశెట్టి వేదిక వద్దకు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- November 28, 2025
0
44
Less than a minute
You can share this post!
editor

