సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్‌గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ ఈయన వివాహపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. రాహుల్, హరిణ్య స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ పెళ్ళికి రావాలి అంటూ ఆహ్వానించిన సంగతే తెలిసిందే. మరికొద్ది రోజులలో వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా సంగీత్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సంగీత్ వేడుకలో భాగంగా రాహుల్ తనకు కాబోయే భార్య హరిణ్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. హరిణ్యకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అంటే విపరీతమైన అభిమానమట. ఈ క్రమంలోనే రాహుల్ తన సంగీత్ వేడుకకు చాహల్‌ను ఆహ్వానించడంతో హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి.
- November 25, 2025
0
87
Less than a minute
You can share this post!
administrator


