లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇక లేరు.!

లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇక లేరు.!

భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (89) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇవాళ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వర్గాలు ధృవీకరించాయి. ధర్మేంద్ర మరణ వార్త బాలీవుడ్‌ను, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర 1960లలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించాడు. ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, కామెడీ పాత్రల్లోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించి, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ మైలురాయి సినిమా 1975లో వచ్చిన ‘షోలే’. ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన వీరు పాత్ర చిరస్మరణీయమైనది. దీంతో పాటు ‘ఫూల్ ఔర్ పత్తర్’, ‘మేరా గావ్ మేరా దేశ్’, ‘యమ్‌లా పగ్లా దీవానా’ సిరీస్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు.

editor

Related Articles