యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరో ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ ‘పాంచ్ మినార్’. రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ లో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. గోవింద రాజు ప్రజెంట్ చేసిన ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై మాధవి, ఎం.ఎస్.ఎం రెడ్డి నిర్మించారు. నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. . ఈ సినిమాకి మీడియా వారు ఇస్తున్న సపోర్ట్ కి థాంక్యూ. శ్రీనివాస్ రెడ్డి గారికి నేను ఫ్యాన్ బాయ్. ఆయనతో కలిసి పనిచేసిన అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన వెంకీ సినిమాకి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ అదిరిపోయింది. థియేటర్స్ కి వెళ్ళాము. అందరూ కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. నా సినిమా థియేటర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు జనాలు అంతా ఎంజాయ్ చేస్తూ చూడడం నిజంగా చాలా రోజులైంది. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది.
- November 24, 2025
0
52
Less than a minute
You can share this post!
editor

