హీరోయిన్ మీనా గురించి దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అప్పట్లో మీనాకు ఉండే ఫాలోయింగ్ వేరే. అందం, అభినయంతో సిల్వర్ స్క్రీన్ పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఒకప్పుడు యూత్ ఫేవరేట్ హీరోయిన్ సైతం ఆమెనే. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైనప్పటికీ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. ఇదలా ఉంటే.. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే చెన్నైకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను 2009లో పెళ్లి చేసుకున్నారు మీనా. ఈ దంపతులకు ఒక పాప ఉంది. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మీనా.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో బిజీగా మారింది.
- November 24, 2025
0
65
Less than a minute
You can share this post!
editor

