మాళవిక మోహన్ ఇలా ఎందుకు చెప్పిందో తెలుసా?

మాళవిక మోహన్ ఇలా ఎందుకు చెప్పిందో తెలుసా?

మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి చాలా మంది ముద్దుగుమ్మలు వచ్చిన విషయం తెలిసిందే. అలా వచ్చిన వారిలో మాళవిక మోహన్‌ ఒకరు. మాళవిక మోహన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. తలపతి విజయ్ హీరోగా నటించిన తెలుగు, తమిళ్ లో విడుదలైన ‘మాస్టర్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయయిన భామ. అంతకు ముందు మలయాళంలో పలు సినిమాల్లో నటించింది మాళవిక. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘పట్టం బోల’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత వరుసగా అక్కడ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. తమిళ్ లో ధనుష్, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాళవికకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఫోటోలకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది.

editor

Related Articles