ప్రముఖ కథానాయిక రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘జనతాబార్’. రోచి మూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెల 28న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత రమణ మొగలి మాట్లాడుతూ ” స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ విభాగంలో ఉన్న ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశంతో పాటు మహిళల్లో చైతన్యం నింపే సినిమా ఇది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో ఎంతో శక్తివంతమైన పాత్రను పోషించాడు.తప్పకుండా ఈచిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
- November 22, 2025
0
42
Less than a minute
You can share this post!
editor

