హీరో అల్లరి నరేష్ నటించిన ‘12A రైల్వే కాలనీ’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్‌తో పాపులర్ అయిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తూ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంటోంది. సస్పెన్స్ హారర్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను థ్రిల్‌తో కూర్చోబెడుతూ ప్రతి సీన్‌కి కుతూహలం పెంచే విధంగా రూపొందింది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “ఇది నా 63వ సినిమా. ఇప్పటివరకు చేయని కొత్త జానర్ కావడంతో నాకు చాలా ఎగ్జైట్‌గా అనిపించింది. ఇందులో పారానార్మల్ ఎలిమెంట్స్ ఉండడం నాకు చాలా నచ్చింది. కథలోని అనూహ్య ట్విస్ట్‌లు, క్యారెక్టర్ జర్నీ చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఆడియన్స్ ఈ సినిమాను ఎందుకు లవ్ చేస్తున్నారో థియేటర్‌లో చూసినప్పుడు నాకు అర్థమైంది” అన్నారు.
- November 22, 2025
0
40
Less than a minute
You can share this post!
editor

