23న షాకింగ్ అప్‌డేట్…రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ నుంచి..?

23న షాకింగ్ అప్‌డేట్…రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ నుంచి..?

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “రాజా సాబ్” ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్ గా, వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్” ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇటీవల రిలీజ్ చేసిన “రాజా సాబ్” ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

editor

Related Articles