డిసెంబర్ 5 నుంచి‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్..?

డిసెంబర్ 5 నుంచి‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్..?

ఇండియాలో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ జీ 5 వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కులను ఎప్పటిక‌ప్పుడు ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ లిస్టులో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చేరింది. వెర్సటైల్ యాక్ట‌ర్‌ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుత‌మైన స్పంద‌న‌తో పాటు మంచి మ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది.  ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో’ను గ‌మ‌నిస్తే ఓ చిన్నపాటి విలేజ్‌లో ఉండే ఫొటోగ్రాఫ‌ర్ ర‌మేష్ క‌థ‌. త‌ను ఆ గ్రామానికి చెందిన లోక‌ల్ లీడ‌ర్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు.

editor

Related Articles