పాంచ్ మినార్ Review: కాన్సెప్ట్ బాగుంది కానీ…?

పాంచ్ మినార్ Review: కాన్సెప్ట్ బాగుంది కానీ…?

రాజ్ తరుణ్ ఇంతకు ముందు చేసిన కామెడీ పాత్రల మాదిరిగానే కిట్టు పాత్రలో ఎనర్జిటిక్‌గా కనపడతాడు. కొన్ని సీన్లలో అతని టైమింగ్ బాగానే పనిచేసింది. హీరోయిన్ రాశి సింగ్‌కి మాత్రం పెద్దగా స్కోప్ ఇచ్చినట్టుగా అనిపించదు. విలన్ పాత్రల్లో అజయ్ ఘోష్, నితిన్ ప్రసన్నలు తమ వంతు పాత్రలను సరిగ్గా చేశారు. మొదటి హాఫ్‌లో క్రైమ్ మరియు కామెడీ మిక్సింగ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడం, కొన్ని సన్నివేశాలు లాగుతున్నట్టు అనిపించడం వల్ల ఆసక్తి తగ్గుతుంది. స్క్రీన్‌ప్లే కొన్నిచోట్ల జోరును అందుకున్నా వెంటనే పేస్ తగ్గిపోవడం లోపం. బ్యాక్‌గ్రౌండ్ సంగీతం ఓకే అనిపిస్తుంది కానీ పాటలు కథను నిలిపేసేలా ఉంటాయి. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ మరింత పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉండింది. మొత్తానికి “పాంచ్ మినార్”లో కొన్ని కామెడీ సీన్లు, రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ మెప్పిస్తాయి కానీ పూర్తి వినోదాన్ని ఆశించిన వారికి మాత్రం కొంత నిరాశ కలిగించొచ్చు. క్రైమ్ కామెడీ జానర్‌కి ఆసక్తినివారికి ఒకసారి చూడదగిన చిత్రం.

editor

Related Articles