వరుస బ్లాక్‌బస్టర్‌ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో హిస్టారికల్ ఎపిక్ ‘ఎన్.బి.కె 111’ చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రస్తుతం పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా చేస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మెజెస్టిక్-మైటీ క్వీన్స్ చాప్టర్ ప్రారంభమైయింది. ఈ హై బడ్జెట్ సినిమాటిక్ స్పెక్టికల్ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నయనతార ఈ ప్రాజెక్ట్‌లో చేరారు. ఆమె పాత్ర కథనానికి కీలకం కానుంది. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ విజయవంతమైన జంటను మరోసారి తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన ట్రీట్ లాంటిది. ఈరోజు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ ఎనౌన్స్ మెంట్ చేశారు. మేజెస్టిక్ అనౌన్స్‌మెంట్ వీడియోతో సినిమా అంబిషస్ స్కేలు, విజువల్ స్పెక్టకిల్ అన్నీ అద్భుతంగా చూపించారు. సినిమాకి కావాల్సిన గ్రాండ్ టోన్‌ను ఇది సెట్ చేస్తుంది.
- November 19, 2025
0
49
Less than a minute
You can share this post!
editor

