Movie Muzz

“సాయి ధరమ్ తేజ్ తిరుమలలో దర్శనం – కొత్త దశకు దేవుని ఆశీర్వాదం!”

“సాయి ధరమ్ తేజ్ తిరుమలలో దర్శనం – కొత్త దశకు దేవుని ఆశీర్వాదం!”

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన వివాహంపై ఎంతోకాలంగా సాగుతున్న ఊహాగానాలకు స్వయంగా ముగింపు పలికారు. సాయి దుర్గతేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన వివాహంపై స్పందిస్తూ వచ్చే ఏడాదిలో తన వివాహం ఉంటుందన్నారు. ఈ సందర్బంగా మంచి చిత్రాలు, మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శించుకున్నాను అంటూ వచ్చే ఏడాది ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం వస్తోందని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, వచ్చే ఏడాదిలో తన పెళ్లి జరగబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదంతో నాకు మంచి సినిమాలు, మంచి జీవితం దక్కాయి. వచ్చే ఏడాదిలోనే నా వివాహం జరుగుతుంది. కొత్త సంవత్సరం దృష్ట్యా, స్వామివారి ఆశీస్సులతో ముందుకు సాగాలని తిరుమల వచ్చినట్లు తెలిపారు.

administrator

Related Articles