ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యూట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. కొత్తగా పెళ్ళయిన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదాలు, సంతోషాలని ట్రైలర్ ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ లా ప్రజెంట్ చేసింది. ప్రియదర్శి నేచరల్, హ్యుమరస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సిట్యువేషన్ ఎంటర్టైనింగ్ గా వుంది.
- November 18, 2025
0
31
Less than a minute
You can share this post!
editor

