ప్రముఖ నటులైన రజినీకాంత్ మరియు బాలకృష్ణ సినీ రంగంలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ భారత సినిమా పరిశ్రమలో విశేష సేవలు అందించిన ఈ ఇద్దరు లెజెండరీ హీరోలను ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ప్రకటించారు. ఈ ఏడాది గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా వీరిని ఘనంగా అభినందించి ప్రత్యేక సన్మానం చేయనున్నారు. రజినీకాంత్ తన అపారమైన స్టైల్, మాస్ ఇమేజ్‌తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లగా, బాలకృష్ణ తన శక్తివంతమైన నటన, విభిన్న పాత్రలతో తెలుగు సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఈ ఇద్దరి 50 ఏళ్ల ప్రయాణం యువ నటులకు ప్రేరణగా నిలుస్తోంది. వారి కృషి, కళాప్రతిభ మరియు సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తిస్తూ ఇంత పెద్ద వేదికపై సత్కారం దక్కడం నిజంగా గర్వకారణం.
- November 17, 2025
0
11
Less than a minute
You can share this post!
editor

