’12A రైల్వే కాలనీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆ హీరో..?

’12A రైల్వే కాలనీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆ హీరో..?

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ’12A రైల్వే కాలనీ’ ఎక్సైటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసింది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పొలిమేర సిరీస్‌తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. తాజాగా లాంచ్ చేసిన “12A రైల్వే కాలనీ” ట్రైలర్‌ సినిమా టోన్‌, మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. మిస్టరీ మర్డర్స్ సిరీస్‌ చుట్టూ తిరిగే కథలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ సస్పెన్స్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళింది. మూఢ నమ్మకాలు, హీరోకి ఎదురైన భయానక అనుభవాలతో పాటు వాస్తవం – మానసిక భ్రమలు మరింత థ్రిల్‌ని క్రియేట్ చేశాయి. దర్శకుడు నాని కాసరగడ్డ, డా. విశ్వనాథ్ రాసిన థ్రిల్లింగ్‌ కథను తెరపై సస్పెన్స్‌తో ప్రజెంట్ చేశారు.

editor

Related Articles