మోడల్ అనుమానాస్పద మృతి..

మోడల్ అనుమానాస్పద మృతి..

భోపాల్‌ : ఒక మోడల్‌ అనుమానాస్పదంగా మరణించింది. ప్రియుడు ఆమెను హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చనిపోయినట్లు తెలుసుకుని భయంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. 27 ఏళ్ల ఖుష్బూ అహిర్వార్ అలియాస్‌ ఖుషీ వర్మ కాలేజీ చదువును మధ్యలో మానేసింది. మోడల్‌గా ఆమె చేస్తున్నది. పలు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా చేసింది. ‘డైమండ్ గర్ల్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులతో ఆమె పాపురల్‌ అయ్యింది. కాగా, మోడల్‌ ఖుష్బూ గత మూడేళ్లుగా భోపాల్‌లో నివసిస్తోంది. ప్రియుడు కాసిమ్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. సోమవారం తెల్లవారుజామున ఖుష్బూ ఆరోగ్యం క్షీణించింది. దీంతో భైంసఖేడిలోని ఇండోర్ రోడ్డులో ఉన్న హాస్పిటల్‌కు ఆమెను కాసిమ్‌ తీసుకెళ్లాడు. ఖుష్బూ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమె మృతదేహాన్ని హాస్పిటల్‌లో వదిలేసిన కాసిమ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. హాస్పిటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

editor

Related Articles