సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా గ్రాండ్గా లాంచ్ అవుతున్నారు. ఒక అద్భుతమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆర్ ఎక్స్, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను వైజయంతి మూవీస్ అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణతో కల్ట్ బ్లాక్ బస్టర్ అగ్ని పర్వతం చిత్రాన్ని నిర్మించి, తరువాత రాజకుమారుడుతో ప్రిన్స్ మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్వినీదత్, ఇప్పుడు మూడవ తరం స్టార్ జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
- November 10, 2025
0
2
Less than a minute
You can share this post!
editor

