ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఈరోజు ఉదయం 7:25 గంటలకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన అందెశ్రీ, “జయ జయహే తెలంగాణ” రాష్ట్ర గీతం రచించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.1 కోటి పురస్కారం, కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్, దాశరథి సాహితీ పురస్కారం, నంది అవార్డు వంటి అనేక గౌరవాలు అందుకున్నారు. అశువుగా కవిత్వం చెప్పడంలో దిట్టైన ఆయన తెలుగు సాహిత్యానికి చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణం సాహిత్య, సినీ ప్రపంచానికి తీరని నష్టం.
- November 10, 2025
0
35
Less than a minute
You can share this post!
editor

