రోడ్డు ప్రమాదంలో డాన్సర్ మృతి!

రోడ్డు ప్రమాదంలో డాన్సర్ మృతి!

ప్రముఖ రియాల్టీ షో డాన్సర్ సుధీంద్ర (36) దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో మంగ‌ళ‌వారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాజాగా కొనుగోలు చేసిన కారును తన సోదరుడికి చూపించి తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నేషనల్ హైవేపై కారులో వెళుతున్న సుదీంధ్ర కారులో ఏదో స‌మ‌స్య ఉంద‌ని వాహనాన్ని పక్కకు ఆపి పరిశీలిస్తున్నాడు. స‌రిగ్గా అదే సమయంలో వెనుక నుండి వచ్చిన ట్రక్కు అతడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సుధీంద్రను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కన్నడ సినీ, డాన్స్ రంగం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సుధీంద్ర మృతిపై సంతాపం తెలిపింది. భవిష్యత్తులో పెద్దస్థాయికి ఎదగగల ప్రతిభావంతుడిని కోల్పోయామని పలువురు వ్యాఖ్యానించారు.

editor

Related Articles