హీరో నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ మినీ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేశారని సమాచారం. ఇదిలావుంటే.. ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తారట. వారిలో ఒకరు టబు ఇప్పటికే ఫైనల్ అయ్యారు. తాజాగా మరో హీరోయిన్ పాత్రకు సుస్మితాభట్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. మూడో హీరోయిన్‌గా ఓ స్టార్‌ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని, మునుపెన్నడూ చూడని కొత్త నాగార్జునను ఇందులో చూస్తారని చిత్రబృందం చెబుతోంది. నాగచైతన్య, అఖిల్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలు పోషించనున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదలవుతుంది.
- November 4, 2025
0
45
Less than a minute
You can share this post!
editor

