Movie Muzz

కరూర్‌ షాక్‌ తర్వాత విజయ్‌ స్పందన..?

కరూర్‌ షాక్‌ తర్వాత విజయ్‌ స్పందన..?

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో క్రౌడ్‌ కంట్రోల్‌ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.పార్టీ నిర్వహించే సభలు, ప్రచార కార్యక్రమాల్లో జనసమూహాన్ని నియంత్రించడంతో పాటు ప్రజా భద్రతను నిర్ధారించేందుకు ‘తొండర్’ అనే పేరుతో వాలంటీర్‌ బృందాన్ని పార్టీ ఏర్పాటు చేసింది.2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీని స్థాపించిన విజయ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్‌ 27న కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుని ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే సుమారు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది.

ఈ ఘటన నేపథ్యంలో ఇకపై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు టీవీకే తాజా నిర్ణయం తీసుకుంది.

editor

Related Articles