వాల్తేర్ వీరయ్య లాంటి హిట్ తర్వాత ఈ జోడి మళ్లీ కలిసి పనిచేయబోతోంది. మెగా 158 అంటూ రాబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మాళవిక మోహనన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నటి స్పందిస్తూ.. అవన్నీ రూమర్స్ అంటూ తెలిపింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. నేను ‘మెగా 158’ సినిమాలో నటిస్తున్నానని ఆన్లైన్లో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే నా కెరీర్లో ఏదో ఒక రోజు చిరంజీవి సార్‌తో స్క్రీన్ పంచుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం నేను ఈ సినిమాలో భాగం కావడం లేదు. ఆ వార్తలు అవాస్తవం అంటూ మాళవిక రాసుకొచ్చింది. దీంతో చిరంజీవి సరసన మాళవిక నటించబోతున్నారనే ఊహాగానాలకు తెరపడింది. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
- October 29, 2025
0
111
Less than a minute
You can share this post!
editor


