‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనౌన్స్‌మెంట్ డేట్ రిలీజ్..

‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనౌన్స్‌మెంట్ డేట్ రిలీజ్..

ఇండియ‌న్ పాపుల‌ర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజ‌న్ 3తో రాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజ‌న 3 స్ట్రీమింగ్ తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్రైమ్ వీడియో వేదిక‌గా న‌వంబ‌ర్ 21 నుండి తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్‌కి పార్ట్ 3 రాబోతోంది. మొద‌టి రెండు సీజ‌న్‌ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజ్ & డీకే ఈ సీజ‌న్‌కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో పాతాళ్ లోక్ న‌టుడు జైదీప్ అహ్ల‌వ‌త్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా నార్త్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోంది.

editor

Related Articles