బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘రామాయణం’ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తోంది. రావణుడిగా యష్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ విభీషణుడి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వివేక్. ‘రామాయణం’ సినిమాకు తాను అందుకునే పూర్తి పారితోషికాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వివేక్ ప్రకటించారు. తన జీవితంలో ఏది చేసినా పూర్తి ప్రేమతోనే చేస్తానని చెప్పిన వివేక్ తన పారితోషికాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న పిల్లల సహాయార్థం విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు నేను స్పష్టంగా చెప్పాను ఈ సినిమాలో నటించినందుకు ‘నాకు ఒక పైసా కూడా వద్దు’. నేను బలంగా నమ్మే ఒక మంచి కారణం కోసం ముఖ్యంగా క్యాన్సర్ పిల్లల వైద్యం కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలనుకుంటున్నాను అని వివేక్ ఒబెరాయ్ వెల్లడించారు.
- October 28, 2025
0
6
Less than a minute
You can share this post!
editor

