మంచి కలెక్షన్లు రాబట్టిన ‘డ్యూడ్..?

మంచి  కలెక్షన్లు రాబట్టిన ‘డ్యూడ్..?

త‌మిళ న‌టుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హ్యాట్రిక్ కొట్టాడు. తాజాగా ఆయ‌న న‌టించిన డ్యూడ్ సినిమా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. దీంతో వ‌రుస‌గా మూడు సినిమాలు వంద కోట్ల జాబితాలో చేరిన న‌టుడిగా హ్యాట్రిక్‌ రికార్డు అందుకున్నాడు. త‌న మొద‌టి సినిమా ల‌వ్ టుడేతో రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన ప్ర‌దీప్ ఆ త‌ర్వాత వ‌చ్చిన డ్రాగ‌న్ సినిమాతో రూ.150 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించాడు. అనంత‌రం తాజాగా డ్యూడ్‌తో మ‌రో రూ.100 కోట్ల‌ను త‌న క్ల‌బ్‌లో వేసుకున్నాడు. డ్యూడ్ సినిమా విష‌యానికి వస్తే.. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మమితా బైజు హీరోయిన్‌గా న‌టించింది. శరత్‌ కుమార్‌, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించారు.

editor

Related Articles