కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి సినిమాతోనే తెలుగులో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరోయిన్లలో ఒకరు కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ హీరోయిన్ సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు దోచేసిన కృతిశెట్టి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం కృతిశెట్టికి నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. అయితే ఇక చేసేదేమి లేక తమిళంలో తన లక్‌ను పరీక్షించుకోవాలనుకున్న కృతిశెట్టి అక్కడ మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాపులర్ యాక్టర్లతో సినిమాలు చేసి.. షూటింగ్స్ పూర్తి చేసినా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చాయి.
తీవ్ర నిరాశలో ఉండిపోయిన కృతిశెట్టి అభిమానుల కోసం వరుసగా చేసిన ఆ సినిమాలు విడుదలకు ఇప్పుడు రెడీ అయ్యాయి. పై మూడు సినిమాలు ఒకేసారి ఒకే నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ కాబోతుండటం విశేషం.
కృతిశెట్టి కార్తీతో కలిసి నటిస్తున్న వా వాథియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్, రవిమోహన్ Genie సినిమాలు డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విడుదల తర్వాత ఈ హీరోయిన్ ఏ రేంజ్‌లోకి వెడుతుందే ఫ్యాన్స్ వేచిచూడాలి.
