ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా భారీ విజయం సాధించింది. పలు కారణాల వల్ల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో భాగం కాదని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు వస్తారా అనే చర్చ మొదలైంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 పార్ట్ 2’ తెరకెక్కబోతోంది. అయితే పలు కారణాల వల్ల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో యాక్ట్ చేయడం లేదని నిర్మాణ సంస్థ వెల్లడించింది. అప్పటి నుండి పార్ట్2లో హీరోయిన్‌గా అవకాశం ఎవరు దక్కించుకుంటారనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త వైరల్ అవుతోంది. దీపిక స్థానాన్ని భర్తీ చేయడానికి బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌ను దర్శక నిర్మాతలు సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే అలియాభట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

- October 11, 2025
0
6
Less than a minute
You can share this post!
editor