టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘ఫౌజీ’ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దేశభక్తి, యుద్ధం, త్యాగం అనే అంశాల చుట్టూ తిరిగే ఈ కథ, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 60% చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరించేందుకు ఇంకా 35 రోజుల షూటింగ్ మిగిలి ఉందని టాక్. సినిమాకు ‘ఫౌజీ’ అనే పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, త్వరలోనే అధికారికంగా టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఎమోషనల్ టచ్‌కు ప్రాధాన్యతనిచ్చే దర్శకుడైన హను రాఘవపూడి స్టైల్‌కు ప్రభాస్ యాక్షన్ ఇమేజ్ కలిస్తే, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించనున్నట్లు ఇండస్ట్రీలో భావిస్తున్నారు. ‘ఫౌజీ’ సినిమాను 2026 ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం పనిచేస్తోంది.

- October 11, 2025
0
18
Less than a minute
You can share this post!
editor