హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దం పూర్తి చేసుకుని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆమె క్యూట్ లుక్స్, కర్లీ హెయిర్, నేచురల్ చామ్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే అనుపమ నటనతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా అభిమానులలో పెద్ద చర్చే నడుస్తోంది. గతంలో అనుపమకి సంబంధించి పలు రిలేషన్‌షిప్ రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇటీవల మరోసారి అనుపమ ప్రేమ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అనుపమ – ధ్రువ్ కలసి నటించిన తాజా తమిళ సినిమా “బైసన్”, లవ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఏర్పడిందని, అది రిలేషన్‌షిప్‌గా మారిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
- October 11, 2025
0
134
Less than a minute
You can share this post!
administrator


