బండ్ల గణేష్ వ్యాఖ్యలపై స్పందించిన బన్నీ వాసు..

బండ్ల గణేష్ వ్యాఖ్యలపై స్పందించిన బన్నీ వాసు..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ఈవెంట్‌కు బండ్ల గణేష్ హాజరైతే, వార్తే అనుకోవాలి. ఆయన మాటలు తరచూ వివాదాస్పదం అవుతుంటాయి. ఇటీవ‌ల జ‌రిగిన‌, ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యల్లోని పరోక్ష విమర్శలు అల్లు అరవింద్ గురించి అంటూ ప్రచారం జరగడంతో, ప్రొడ్యూసర్ బన్నీ వాసు వెంటనే స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై మరోసారి ఆయన స్పందించారు. మేట‌ర్‌లోకి వెళితే లిటిల్ హార్ట్స్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ తనదైన‌ స్టైల్‌లో మాట్లాడుతూ, “ఇప్పుడు నీ సినిమా హిట్ అయింది కాబట్టి అందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు. ఇది 20 రోజుల మాయ. మహేష్ బాబు ట్వీట్ చేశాడు, విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చాడు అని ఆనందపడకు” అని అన్నారు.
అలాగే, “ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ మెగాస్టార్‌ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకులా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టలేరు. కొందరికే అదృష్టం దక్కుతుంది. మిగతావాళ్లంతా కష్టపడితే చివరికి క్రెడిట్ మాత్రం వాళ్లకే వెళ్లిపోతుంది” అని కూడా చెప్పారు. ఈ మాటలు అల్లు అరవింద్‌పై పరోక్షంగా చేసార‌నే అభిప్రాయం ఆడియెన్స్ మధ్య పెరిగింది. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అల్లు అరవింద్ పక్కనే కూర్చున్న బన్నీ వాసు కాస్త అసహనంగా క‌నిపించారు. బండ్ల గణేష్‌ను చూస్తూ “ఇలా ఇరికించేశాడేంటి!” అన్నట్టు హావభావాలు చూపించారు.

editor

Related Articles