సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని ఎటువంటి తారతమ్యం చూపనని సోనియా అగర్వాల్ అన్నారు. ఈమె ప్రధాన పాత్ర పోషించిన తాజా సినిమా విల్. ఫుడ్ స్టెప్స్ ప్రొడక్షన్స్, కొత్తారి మద్రాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది. ఎస్.శివరామన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా.. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. విక్రాంత్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించారు. ఈ సినిమా నేడు శుక్రవారం రిలీజైంది. దర్శకుడు శివరామన్ మాట్లాడుతూ ఇది కోర్టు నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ సినిమాలో సోనియా అగర్వాల్ జడ్జిగా నటించగా, అలోకియా చిన్న వివాదాస్పద పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్‌ను సంగీత దర్శకుడుగా పరిచయం చేసినట్లు చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. శివరామన్ డైరెక్షన్‌లో తాను ఇంతకుముందు తనిమై అనే సినిమాలో నటించానని, ఆ తర్వాత ఇప్పుడు విల్ సినిమాలో నటించినట్లు చెప్పారు. తాను చిత్రాల విషయంలో చిన్న, పెద్ద అన్న తారతమ్యాన్ని చూడనని, ఇంతకుముందు కోటి రూపాయల వ్యయంతో రూపొందించిన కాదల్ కొండేల్ సినిమా ఘనవిజయాన్ని సాధించి మంచి కలెక్షన్లు రాబట్టిందని గుర్తు చేశారు.

- October 10, 2025
0
27
Less than a minute
You can share this post!
editor