రాజ‌మౌళి బ‌ర్త్‌డే స్పెష‌ల్ వీడియో..

రాజ‌మౌళి బ‌ర్త్‌డే స్పెష‌ల్ వీడియో..

తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మొద‌ట‌గా గుర్తుకువ‌చ్చే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని చెప్ప‌క‌ త‌ప్ప‌దు. ఈగ సినిమాతో ఇండియా మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్న జ‌క్క‌న్న ఆ త‌ర్వాత వ‌చ్చిన బాహుబ‌లితో ఒక్క‌సారిగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాపుల‌ర్‌ అయ్యారు. ఈ సినిమా మంచి విజ‌యం అందుకోవ‌డ‌మే కాకుండా దాదాపు రూ.1,800 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాల‌లో టాప్ 5లో కొన‌సాగుతోంది. అయితే ఈ సినిమాను మ‌ళ్లీ రీ రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చి ఇటీవ‌ల 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సినిమా రెండు భాగాల‌ను కలిపి ఒకే పార్ట్‌గా క‌లిపి అక్టోబ‌ర్ 31న‌ రీ-రిలీజ్ చేయ‌బోతున్నారు మేక‌ర్స్. అయితే నేడు రాజ‌మౌళి పుట్టిన‌రోజు కావ‌డంతో ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ.. బాహుబ‌లి టీమ్ ఒక స్పెష‌ల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో బాహుబలిని ప్రపంచ స్థాయి సినిమాగా మలచడానికి రాజ‌మౌళి చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బిజ్జ‌ల‌దేవా మేకింగ్ సీన్ హైలైట్‌గా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు.

editor

Related Articles