తనదైన శైలితో పాటు, కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి వార్తల్లో నిలిచారు. సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసి వెళ్ళే ఫార్ములాతో కెరీర్‌లో సక్సెస్‌ల పరంపర కొనసాగిస్తున్న ఆయన, తాజాగా మరో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ధనుష్ – నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇడ్లీ కొట్టు సినిమా అక్టోబర్ 1న విడుదలై ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై మంచి హైప్ తెచ్చుకుంది. కాకపోతే అనుకున్నంత హిట్ కాలేకపోయింది. ఇక ఇదే సమయంలో ధనుష్ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో స్క్రీన్ షేర్ చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. కథ, దర్శకుడు వంటి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మల్టీస్టారర్స్ ధనుష్‌కు కొత్తేమీ కాదు. ఇటీవల నాగార్జునతో కలిసి చేసిన “కుబేర” సినిమాలో ఆయన నటన విపరీతమైన ప్రశంసలు అందుకున్నారు. నాగ్ కూడా తన స్వాగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా సహజ నటనతో మెప్పించాడు. ఇదే సమయంలో మోహన్‌లాల్‌తో చేయబోతున్న సినిమా పట్ల కూడా అభిమానుల్లో భారీ ఎగ్జైట్‌మెంట్ నెలకొంది. ధనుష్ – మోహన్ లాల్ కలిసి నటిస్తే బాక్సాఫీస్ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.
