సౌతిండియన్ హీరోయిన్ నయనతార ఎమోషనల్ అయ్యింది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం తాను తొలిసారి కెమెరా ముందు నిలుచున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో నయనతార ఓ పోస్ట్ పెడుతూ, తన భావోద్వేగాలకు అద్దం పట్టింది. సినిమాలను నేను జీవితంలో ఇంతగా ప్రేమిస్తానని నాకు అప్పుడు తెలియదు. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం… నన్ను నన్నుగా తీర్చిదిద్దాయి. నాకు స్వాంతన చేకూర్చాయి. నన్ను నన్నుగా చేశాయి… ఎప్పటికీ కృతజ్ఞతలతో…’ అంటూ తన మనసులోని భావాలను నయనతార వ్యక్తపర్చింది. 2023లో విడుదలైన మలయాళ చిత్రం ‘మనస్సినక్కరే’ నయన్ తొలి సినిమా. ఇందులో జయరామ్ హీరోగా నటించాడు. అయితే… రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాతో నయనతార స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. పలు భాషలలో కమర్షియల్ హీరోయిన్‌గా నటిస్తూనే, లేడీ ఓరియంటెడ్ సినిమాలకూ శ్రీకారం చుట్టింది. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకునే నాయికగా ఎదిగింది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయన తార ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయింది.
- October 9, 2025
0
127
Less than a minute
You can share this post!
administrator


