అల్లు అర్జున్‌-అట్లీ సినిమా షూటింగ్ అబుదాబిలో..

అల్లు అర్జున్‌-అట్లీ సినిమా షూటింగ్ అబుదాబిలో..

ఇటీవలే ముంబైలో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA22xA6 కోసం అల్లు అర్జున్‌ టీం కొత్త లొకేషన్ల వేటలో భాగంగా అబుదాబికి పయనమైనట్టు వార్త‌లు వ‌చ్చాయి. పుష్ప 2 ది రూల్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత అల్లు అర్జున్‌ కోలీవుడ్‌ డైరెక్టర్ అట్లీ సినిమాను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సైలెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లి చిత్రీక‌ర‌ణ జరుపుకుంటోంది.
పాపుల‌ర్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు ఈ సినిమా విడుద‌ల తేదీపై క్లారిటీ ఇచ్చాడు. మిత్రమండ‌లి ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో బ‌న్నీ వాసు మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ ఎప్పుడ‌నేది పొంగ‌ల్ 2026 స‌మ‌యంలో మేక‌ర్స్ ప్ర‌క‌టిస్తార‌ని చెప్పాడు. అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో తొలిసారి వ‌స్తున్న సినిమా కావ‌డం.. వ‌న్ ఆఫ్ ది లీడింగ్ బ్యాన‌ర్ అయిన స‌న్ పిక్చ‌ర్స్‌లో సినిమా వ‌స్తుండ‌టంతో అంచ‌నాలు అమాంతం పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గా అల్లు అర్జున్‌, అట్లీ జపనీస్ బ్రిటీష్‌ డ్యాన్సర్‌, కొరియోగ్రాఫర్‌ హొకుటో కొనిషితో దిగిన ఫొటోలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. సాయి అభ్యాంకర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

editor

Related Articles