Movie Muzz

రజినీ, కమల్ కలయికలో మల్టీస్టారర్ సినిమా?

రజినీ, కమల్ కలయికలో మల్టీస్టారర్ సినిమా?

రీసెంట్‌గా సోషల్ మీడియాతో సహా సినీ వర్గాలని షేక్ చేసిన క్రేజీ వార్తల్లో బిగ్ స్టార్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే, కమల్ హాసన్‌ల మల్టీస్టారర్ కోసం సినిమా అని చెప్పవచ్చు. మరి ఈ సినిమాని సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తాడని మొదట రూమర్స్ వచ్చాయి. కానీ తర్వాత లేదని మళ్ళీ వినిపించింది. ఇక ఈ భారీ కాంబినేషన్‌ని చేసే మరో దర్శకుడు ఎవరు అనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే అలా వచ్చిన కొన్ని పేర్లలో టాలెంటెడ్ దర్శకుడు హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు కూడా వచ్చింది. అయితే ఈ యంగ్ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో నిజం లేదని చెబుతున్నట్టు తమిళ సినిమా వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తాను నటన మీద మాత్రమే ఫోకస్‌గా ఉన్నానని దర్శకునిగా సినిమాలు చేయడం లేదని సో ఈ కాంబినేషన్‌కి దర్శకుడు తాను కాదని చెప్పినట్టు టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

administrator

Related Articles