ఇటీవల పవన్ నటించిన ఓజీ సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే మరో మైలురాయిగా నిలిచింది. ఈ సక్సెస్ వేవ్ ఇంకా కొనసాగుతుండగానే పవన్ కొత్త సినిమా గురించి హాట్ న్యూస్ ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. సినీవర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారట. ఇప్పటికే ఈ ముగ్గురు వేరు వేరు సినిమాలతో టాలీవుడ్‌ను కుదిపేశారు. ఇప్పుడు ఒక్కటైతే సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం అంటున్నారు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ విజయం అనంతరం, పవన్ సినిమాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఇలాంటి టైమ్‌లో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌పై గుసగుసలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి .. కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హ్యూమర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

- October 7, 2025
0
44
Less than a minute
You can share this post!
editor