ఎయిర్ హోస్టెస్ నుండి హీరోయిన్‌గా సక్సెస్‌లు..

ఎయిర్ హోస్టెస్ నుండి హీరోయిన్‌గా సక్సెస్‌లు..

ఈ హీరోయిన్ ఎయిర్ హోస్టెస్ నుండి హీరోయిన్‌గా మారింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. చేసిన అయిదు సినిమాల్లో నాలుగు హిట్స్. ఇప్పుడు ఇలా హాట్ ఫోజులతో సోయగాలు ఆరబోస్తోంది. హాట్ ఫోజులతో హీట్ పెంచేస్తున్న ఈ హీరోయిన్ రాశిసింగ్. ఈ ఛత్తీస్‌గఢ్ హీరోయిన్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. హీరోయిన్ కాకముందు రాశిసింగ్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసేది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేసింది. ఆది సాయికుమార్ హీరోగా చేసిన శశి (2021) సినిమాతో డెబ్యూ చేసింది రాశిసింగ్, అది ఒక రొమాంటిక్ సినిమా. శశి తర్వాత తెలుగులో మరో నాలుగు సినిమాలు చేసింది రాశిసింగ్. ఆ నాలుగు సినిమాలు కూడా హిట్సే కావడం విశేషం. సంగీత శోభన్‌తో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రేమ్‌కుమార్ (2023), శివ కందుకూరితో మిస్టరీ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ (2024), సుహాస్‌తో క్రైమ్ థ్లిల్లర్ ప్రసన్న వదనం (2024), నవీన్ చంద్రతో సస్పెన్స్ థ్లిల్లర్ బ్లైండ్ స్పాట్ (2025) సినిమాల్లో నటించింది రాశిసింగ్.

editor

Related Articles