ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్‌కి వచ్చిన కొత్త సినిమాల్లో ఈటీవీ విన్‌లో ప్రసారం చేస్తున్న కథా సుధలో కొత్త లఘు సినిమా “అద్దంలో చందమామ” కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
ప్రవచనకర్తగా జాతీయ స్థాయిలో సైతం ఎంతో పేరున్న వేదమూర్తుల సుబ్రహ్మణ్య శాస్త్రి (గోపరాజు రమణ రాజు) తన భార్య గాయత్రి (సురభి పార్వతి)లు తన దాంపత్య జీవితంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. కానీ వీరికి పుట్టిన కూతురు వేదవతి (దివ్య) మాత్రం వారి కుటుంబ సంప్రదాయాలకి చాలా భిన్నంగా వ్యతిరేక అభిరుచులతో ట్రెండీ ఆలోచనలతో ఉంటుంది. అలాంటి కూతురు వల్ల ఈ భార్యాభర్తల మధ్య జరిగిన మనస్పర్థలు ఏంటి? ఎందుకు గాయత్రి తన భర్తని వదిలేసి వెళ్ళిపోతుంది? ఆ తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రి పరిస్థితి ఏంటి? ఆమె వెనక్కి తిరిగి వచ్చిందా లేదా? వీళ్ళ కూతురు చేసిన ఘనకార్యం ఏంటి? అనేవి ఇందులో అసలు కథ. ఈ లఘు సినిమాని ఈ టీవీ విన్‌లో చూస్తేనే బావుంటుంది.
