స్టార్ ధ్రువ్ విక్రమ్ కాంపౌండ్ నుండి వస్తోన్న సినిమా బైసన్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బైసన్ దీపావళి కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ధ్రువ్ విక్రమ్. ఇప్పటికే సినిమాలు చేసినా.. తాను మళ్లీ మొదటి సినిమాతోనే మీ ముందుకొస్తున్నానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు ధ్రువ్. ఈ స్టార్ కిడ్ కాంపౌండ్ నుండి వస్తోన్న ప్రాజెక్ట్ బైసన్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బైసన్ దీపావళి కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉన్నాడు ధ్రువ్.
ఈవెంట్‌లో ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ.. నా పేరు ధ్రువ్.. ఇప్పటివరకు నేను రెండు సినిమాలు చేశా. మీరు ఆ రెండు సినిమాలు చూడకున్నా నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ బైసన్ మాత్రం మీరు తప్పకుండా చూడాలి. నిజానికి ఇదే నా మొదటి సినిమా. ఈ సినిమా కోసం వంద శాతం కష్టపడ్డా. మీరు మీ కుటుంబం, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్.. అందరితో కలిసి ఈ సినిమా చూడొచ్చునని చెప్పాడు. ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి.
